[ad_1]
Published on Feb 6, 2024 1:00 AM IST
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అతి త్వరలో దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించనున్న పాన్ వరల్డ్ గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ SSMB 29 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ కావాల్సిన ఈ మూవీ గురించి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని జక్కన్న అండ్ టీమ్ ప్రారంభించిందట.
ఇండియన్ మూవీ హిస్టరీలోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందనున్న ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తుండగా శ్రీ దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ అత్యంత భారీ స్థాయిలో నిర్మించనున్నారు. విషయం ఏమిటంటే, తాజాగా ఈ మూవీ గురించి ఒక న్యూస్ వైరల్ అవుతోంది.
వాస్తవానికి తన సినిమాలకు సంబంధించి ఎక్కువగా టెక్నీషియన్స్ ని మార్చకుండా ముందుకు సాగే జక్కన్న ఈ మూవీ కోసం కెమెరా మ్యాన్ గా కేకే సెంథిల్ కుమార్ ప్లేస్ లో పీఎస్ వినోద్ ని అలానే విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ గా కమల కన్నన్ ని తీసుకుంటున్నట్లు టాక్.
అయితే గతంలో రాజమౌళి తీసిన చాలా సినిమాలకు పనిచేసిన కమల కన్నన్, ఇటీవల ఆర్ఆర్ఆర్ కి మాత్రం వర్క్ చేయలేదు. అలానే కేకే సెంథిల్ కుమార్ మాత్రం వరుసగా ఆయనతో వర్క్ చేస్తూ వస్తున్నారు. మరి ప్రస్తుతం SSMB 29 విషయమై వైరల్ అవుతున్న ఈ న్యూస్ లో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలంటే దీనిపై మేకర్స్ నుండి క్లారిటీ వచ్చే వరకు ఆగాల్సిందే.
[ad_2]