Home Cinema News Ghost Telugu Movie Review

Ghost Telugu Movie Review

0
Ghost Telugu Movie Review

[ad_1]

Ghost Movie Review in Telugu

విడుదల తేదీ : నవంబర్ 04, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: శివ రాజ్ కుమార్, జయరామ్, అనుపమ్ ఖేర్, అర్చనా జాయిస్, ప్రశాంత్ నారాయణన్, సత్యప్రకాష్, అభిజీత్ తదితరులు

దర్శకుడు : ఎంజి శ్రీనివాస్

నిర్మాత: సందేశ్ నాగరాజ్

సంగీతం: అర్జున్ జన్యా

సినిమాటోగ్రఫీ: మహేంద్ర సింహా

ఎడిటర్: దీపు ఎస్ కుమార్

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ హీరోగా విజయ దశమి సందర్భంగా అక్టోబర్ 19న కన్నడలో విడుదలైన సినిమా ‘ఘోస్ట్’. ఈ సినిమా తాజాగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుందో చూద్దాం..

 

కథ :

బిగ్ డాడీ అలియాస్ ఘోస్ట్ (శివ రాజ్ కుమార్) తన గ్యాంగ్ తో ఓ జైలును టార్గెట్ చేస్తాడు. అప్పటికే మాజీ సీబీఐ అధికారి వామన్ శ్రీనివాస్ (ప్రశాంత్ నారాయణన్) 10 ఏళ్ల పోరాటం చేసి ఆ జైలు ప్రయివేటీకరణ బిల్లుకు ప్రభుత్వం నుంచి అనుమతి సాధిస్తాడు. కరెక్ట్ గా భూమి పూజ చేయడానికి వెళ్లిన వామన్ కు పెద్ద షాక్ తగులుతుంది. అతన్ని కిడ్నాప్ చేసి, ఆ జైలులోని ఓ టవర్ ను తన ఆధీనంలోకి తీసుకుంటాడు బిగ్ డాడీ. దాంతో ఈ కేసును సాల్వ్ చేయడానికి ప్రభుత్వం చరణ్ రాజ్ (జయరామ్)ని రంగంలోకి దించుతుంది. ఇంతకీ ఈ బిగ్ డాడీ ఎవరు ?, అతని గతం ఏమిటి ?, అసలు అతను ఘోస్ట్ గా ఎందుకు మారాడు ?, అలాగే ఆ జైలునే ఎందుకు టార్గెట్ చేశాడు ?, అసలు వామన్ శ్రీనివాస్ కి – బిగ్ డాడీ కి మధ్య కనెక్షన్ ఏమిటి ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

గ్యాంగ్ స్టర్ డ్రామాగా వచ్చిన ఈ ఘోస్ట్ లో లార్జర్ దేన్ లైఫ్ క్యారెక్టర్లో శివ రాజ్ కుమార్ చాలా వైల్డ్ గా కనిపించారు. పవర్ ఫుల్ పాత్ర‌లో తన టెర్రిఫిక్ పెర్ఫార్మెన్స్ తో ఆయన ఆకట్టుకున్నాడు. తన అగ్రెసివ్ బాడీ లాంగ్వేజ్, డామినేట్ చేసే తన క్యారెక్టరైజేషన్ అండ్ మాడ్యులేషన్ తో శివ రాజ్ కుమార్ తన పాత్రకు పర్ఫెక్ట్ గా న్యాయం చేశాడు. పైగా తన గత సినిమాల్లో కంటే ఈ సినిమాలో శివ రాజ్ కుమార్ కొత్త లుక్స్ తో ఆకట్టుకున్నాడు.

ఈ చిత్రానికి మరో ప్రధానాకర్షణ జయరామ్. ఆయన ఎప్పటిలాగే తన టైమింగ్ తో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా కొన్ని కీలక సన్నివేశాల్లో జయరామ్ నటన చాలా బాగుంది. తండ్రి పాత్రలో కనిపించిన అనుపమ్ ఖేర్ తన నటనతో మెప్పించారు. అర్చనా జాయిస్, ప్రశాంత్ నారాయణన్, సత్యప్రకాష్, అభిజీత్ అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు. కొన్ని కీలక సన్నివేశలను దర్శకుడు హై టెక్నికల్ వేల్యూస్‌ తో బాగా తెరకెక్కించాడు.

 

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాలో మెయిన్ ప్లాట్ వైవిధ్యమైనది కాకపోయినా.. కనీసం ఇంట్రెస్ట్ గా అయిన సాగాలి. ఈ ఘోస్ట్ కథలో అది కూడా మిస్ అయింది. దర్శకుడిగా ఎంజి శ్రీనివాస్ మంచి కథా నేపథ్యం రాసుకున్నప్పటికీ.. ఆసక్తికరమైన కథనంతో సినిమాని ఇంట్రెస్టింగ్ గా మలచలేకపోయారు. అక్కడక్కడ బోర్ గా సాగే సన్నివేశాలు కొంత ఇబ్బందిని కలిగిస్తాయి. పైగా ఈ చిత్రం చూస్తున్నంత సేపు రెగ్యులర్ యాక్షన్ డ్రామాలే గుర్తుకువస్తాయి.

అన్నిటికీ మించి సినిమాలో గుర్తు ఉండిపోయే ఒక్క ఎమోషన్ కూడా బలంగా ఎలివేట్ కాలేదు. నిజానికి క్లైమాక్స్ లో హీరో క్యారెక్టర్ ను ఎమోషనల్ గా డిజైన్ చేసినప్పటికీ.. అది పెద్దగా స్క్రీన్ మీద వర్కౌట్ కాలేదు. సినిమాలో ఎక్కువ భాగం యాక్షన్ అండ్ ఇన్విస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో సాగినా.. ఎక్కడా వాట్ నెక్స్ట్ అనే టెన్షన్ కూడా బలంగా లేకపోవడం ఈ ఘోస్ట్ సినిమాకి మరో బలహీనత.

ఈ ఘోస్ట్ సినిమా మెయిన్ గా మాస్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యే జోనర్ అయినప్పటికీ.. దర్శకుడు ఎంజి శ్రీనివాస్ మాత్రం అక్కడక్కడ ఆకట్టుకునే యాక్షన్ ను తప్ప.. మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే ఎలిమెంట్స్ ను సినిమాలో ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. పైగా ఈ చిత్రంలో చాలా తేలికపాటి ఇన్విస్టిగేషన్ తోనే ముగించడం అంతగా రుచించదు.

 

సాంకేతిక విభాగం :

దర్శకుడు ఎంజి శ్రీనివాస్ మంచి స్టోరీ ఐడియా తీసుకున్నారు గానీ, ఆ ఐడియాకు తగ్గట్టు అంతే కొత్తగా ట్రీట్మెంట్ ను మాత్రం రాసుకోలేదు. సినిమాలో సస్పెన్స్ తో ఇంట్రెస్ట్ పెంచే స్కోప్ ఉన్నప్పటికీ ప్లే సింపుల్ గా హ్యాండల్ చేశారు. మ్యూజిక్ విష‌యానికి వ‌స్తే…అర్జున్ జన్యా అందించిన సంగీతం చాలా బాగుంది. మహేంద్ర సింహా సినిమాటోగ్రఫర్ పనితనం బాగుంది. సినిమా మూడ్ కి అనుగుణంగా మహేంద్ర సింహా దృశ్యాలని బాగా తెరకెక్కించారు. ఎడిటింగ్ బాగున్నప్పటికీ కథకు అవసరం లేని సీన్స్ ను ట్రీమ్ చేసి ఉంటే బాగుండేది. ఇక సినిమాలోని సందేశ్ నాగరాజ్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.

 

తీర్పు :

‘ఘోస్ట్’ అంటూ వచ్చిన ఈ సినిమాలో కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ మరియు శివరాజ్ కుమార్ వైల్డ్ పెర్ఫార్మెన్స్ బాగున్నాయి. అయితే, బోరింగ్ ప్లేతో పాటు లాజిక్ లెస్ సీన్స్, ఇంట్రెస్ట్ కలిగించలేని యాక్షన్ డ్రామా సినిమాకి మైనస్ అయ్యాయి. దీనికితోడు డబ్బింగ్ కూడా బాగాలేదు. ఓవరాల్ గా ఈ సినిమాలో కొన్ని యాక్షన్ ఎలిమెంట్స్ బాగున్నా.. సినిమా మాత్రం కనెక్ట్ కాదు.

 

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

[ad_2]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here