[ad_1]
నాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో, డైరెక్టర్ శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కిన హాయ్ నాన్న మూవీ థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం కి పాజిటివ్ టాక్ రావడం తో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను కూడా రాబడుతోంది. ఈ చిత్రం ను చూసిన పలువురు సినీ ప్రముఖులు ఇప్పటికే సినిమా పై ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా ఆ లిస్ట్ లో కన్నడ సూపర్ స్టార్ అయిన శివ రాజ్ కుమార్ జాయిన్ అయ్యారు.
నాని నటించిన హాయ్ నాన్న మూవీ పై ప్రశంసల వర్షం కురిపించారు. చాలా బాగా తీసినందుకు కంగ్రాట్స్ అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక ఫాదర్ కి, డాటర్ కి మధ్యన చూపించిన బాండింగ్ చాలా బాగుంది అని అన్నారు. శివ రాజ్ కుమార్ చేసిన పోస్ట్ కి గాను హీరో నాని రెస్పాండ్ అయ్యారు. థాంక్యూ అంటూ చెప్పుకొచ్చారు.
This man and his love is something else ♥️
Thank you dear @NimmaShivanna ????????#HiNanna https://t.co/wvxgvNgCHK— Hi Nani (@NameisNani) December 12, 2023
[ad_2]