[ad_1]
Published on Jan 8, 2024 9:40 PM IST
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ దేవర. మొత్తం రెండు పార్ట్ లు రూపొందుతోన్న ఈ మూవీ యొక్క ఫస్ట్ పార్ట్ మూవీ ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా సైఫ్ ఆలీ ఖాన్ విలన్ పాత్ర చేస్తున్నారు. నేడు దేవర ఫస్ట్ పార్ట్ యొక్క గ్లింప్స్ ని ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చారు మేకర్స్.
కాగా మొత్తం ఐదు భాషల్లో రిలీజ్ అయిన దేవర గ్లింప్స్ కి అందరి నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. విషయం ఏమిటంటే, వేగంగా 500కె లైక్స్ సొంతం చేసుకున్న గ్లింప్స్ గా దేవర రికార్డు సొంతం చేసుకుని యూట్యూబ్ లో దూసుకెళుతోంది. ముఖ్యంగా ఎన్టీఆర్ పవర్ఫుల్ లుక్స్, ఫైట్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్,విజువల్స్ దేవర గ్లింప్స్ లో అదిరిపోయాయి అని చెప్పాలి. అన్ని కార్యక్రమాలు ముగించి దేవర పార్ట్ 1 మూవీ ని ఏప్రిల్ 5న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి తీసురానున్నారు.
[ad_2]