[ad_1]
టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ప్రధాన పాత్రలో, మాస్ యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ స్కంద. సెప్టెంబర్ 15, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది ఈ సినిమా. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ చిత్రంకి సంబందించిన థియేట్రికల్ రైట్స్ మరియు నాన్ థియేట్రికల్ రైట్స్ కు కూడా భారీగా డిమాండ్ పెరిగింది. సినిమా పై ఏ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి అనేది బిజినెస్ ను చూస్తుంటే అర్థమవుతుంది. రామ్ కెరీర్ బెస్ట్ వసూళ్లు కూడా ఈ సినిమా రాబట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రం లో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుంది. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు.
[ad_2]