[ad_1]
Published on Jan 23, 2024 4:17 PM IST
పోస్ట్ కోవిడ్ ఇండియన్ సినిమా కోలుకోవడానికి కాస్త సమయం తీసుకుంది. అప్పుడు వరకు చాలా ఇండస్ట్రీస్ నుంచి థియేటర్స్ లో సినిమాలు నెమ్మదిగా స్టార్ట్ అవుతూ వచ్చాయి కానీ బాలీవుడ్ ఇండస్ట్రీ గత 2022 లో పడిన స్ట్రగుల్ అయితే గతంలో ఎప్పుడూ పడలేదు. ఒక్క సినిమా కూడా సరిగ్గా రాణించకపోవడం, ఒకవేళ భారీ రిలీజ్ అయ్యినా అవి సరిగ్గా ఆడకపోవడంతో బాలీవుడ్ లో ఎన్నో ఏళ్ల తర్వాత చాలా ఇబ్బంది వాతావరణం నెలకొంది.
కానీ దాని నుంచి ఫైనల్ గా గత ఏడాదిలో భారీ హిట్స్ వచ్చాయి. ఇక అంతా బాగానే ఉంది అనుకుంటే ఇప్పుడు మళ్ళీ కాస్త కంగారు స్టార్ట్ అయ్యింది. జెనరల్ గా ఓ పేరు మోసిన స్టార్ హీరో సినిమా వస్తుంది అంటే బాలీవుడ్ లో బుకింగ్స్ మామూలు రేంజ్ లో ఉండవు. కానీ ఇప్పుడు ఆశ్యర్యకరంగా హృతిక్ రోషన్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ లాంటి సెన్సేషనల్ కాంబినేషన్ నుంచి వస్తున్నా “ఫైటర్” చిత్రానికి ఏమంత గొప్ప బజ్ కనిపించడం లేదు.
పాన్ ఇండియా లెవెల్లో కూడా ఈ సినిమాని అనౌన్స్ చేయలేదు అయినా కూడా హిందీ మార్కెట్ లో చాలా తక్కువ బుకింగ్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. రీసెంట్ గా షారుఖ్ నటించిన డంకి చిత్రానికి కూడా ఇదే టైప్ పరిస్థితి నెలకొంది. రెండు భారీ హిట్స్ కొట్టినప్పటికీ డంకి కి మాస్ సినిమా రేంజ్ బుకింగ్స్ పడలేదు. కానీ ఇక్కడ ఫైటర్ భారీ యాక్షన్ సినిమా అయినా కూడా పూర్ బుకింగ్స్ కనిపిస్తూ ఉండడం మళ్ళీ బాలీవుడ్ డీలా పడుతుందా అనే సంకేతాలు చూపిస్తుంది. ఇక రిలీజ్ అయ్యి వసూళ్లు ఎలా ఉంటాయి అనేది చూస్తే తప్ప ఒక అంచనా అయితే రాకపోవచ్చు.
[ad_2]