Home Cinema News ‘బేబీ’ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించిన డైరెక్టర్ సాయి రాజేష్ |

‘బేబీ’ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించిన డైరెక్టర్ సాయి రాజేష్ |

0
‘బేబీ’ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించిన డైరెక్టర్ సాయి రాజేష్ |

[ad_1]

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య తొలిసారిగా కలిసి నటించిన లేటెస్ట్ లవ్, యక్షన్, ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ బేబీ. మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు కలిగిన ఈ మూవీ ఇటీవల ప్రేక్షకాభిమానుల ముందుకి వచ్చి బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సొంతం చేసుకుని ప్రస్తుతం బాగా కలెక్షన్ తో కొనసాగుతోంది. సాయి రాజేష్ తెరకెక్కించిన ఈ మూవీని మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్ కె ఎన్ నిర్మించారు.

అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో భాగంగా డైరెక్టర్ సాయి రాజేష్ ఈ మూవీ గురించి మాట్లాడుతూ పలు ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు. తమ సినిమా షూటింగ్ పూర్తి కాకముందే 5 గంటలకు పైగా ఫుటేజీని పొందినట్లు ఆయన తెలిపారు. ఈ విషయం తెలియగానే నిర్మాత ఎస్‌కెఎన్ చలించిపోయారని సాయి రాజేష్ పేర్కొన్నారు. అనంతరం తాము ఎడిటింగ్ ప్రారంభించామని, ఆ తర్వాత దాదాపు 4 గంటల ఫుటేజీ వచ్చిందని సాయి రాజేష్ చెప్పారు. 4 గంటల నిడివితో సినిమాను విడుదల చేయడం కుదరదు కనుక మళ్లీ సినిమాను ఎడిట్ చేయడం ప్రారంభించాం, కానీ ఏది తొలగించాలో, ఏది తొలగించకూడదో మాకు కూడా కొంత అర్ధం కాలేదు.

మొదట్లో నేను, ఎస్‌కెఎన్‌లు నిడివి విషయంలో కొంత ఆలోచనలో పడడంతో అనంతరం బన్నీ వాస్, మారుతి ఆ విషయాన్ని నాకు వదిలేశారు అని సాయి రాజేష్ పేర్కొన్నారు. ప్రమోషన్స్ సమయంలో చాలా కీలకమైన సన్నివేశాలను వదులుకోవాల్సి వచ్చిందని, దాని కారణంగా విరాజ్ పాత్రకు సరైన ముగింపు ఇవ్వలేకపోయానని సాయి రాజేష్ అన్నారు. మరి బేబీ మూవీని ఓటిటి వెర్షన్‌లో డైరెక్టర్స్ కట్‌ను టీమ్ విడుదల చేస్తుందో లేదో వేచి చూడాలి.

[ad_2]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here