[ad_1]
హీరో కార్తికేయ గుమ్మకొండ కథానాయకుడిగా, నేహా శెట్టి కథానాయికగా ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలయి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో థియేటర్ల సంఖ్య పెంచుకుంటున్న చిత్రం బెదురులంక 2012. ఆర్ఎక్స్ 100 తర్వాత మరో బ్లాక్ బస్టర్ కోసం ఎన్నో రోజుల నుండి ఎదురుచూస్తున్న హీరో కార్తికేయ గుమ్మకొండ కి భారీ సక్సెస్ రావడంతో చాలా సంతోషంగా ఉన్నారు. అదే సమయంలో తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు ఎవ్వరూ గెలుచుకోని బెస్ట్ యాక్టర్ నేషనల్ అవార్డు పుష్ప చిత్రానికి గాను హీరో అల్లు అర్జున్ కి దక్కింది.
ఈ సందర్భంగా హీరో కార్తికేయ బన్నీ ని కలవడానికి వెళ్లగా, బన్నీ మరియు కార్తీకేయ ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు. ఈ చిత్రానికి ఇంత పాజిటివ్ రెస్పాన్స్ రావడం సంతోషంగా ఉంది. రానున్న రోజుల్లో తన ఫ్యామిలీ తో బెదురులంక 2012 చిత్రాన్ని చూస్తానని బన్నీ చెప్పడంతో కార్తికేయ చాలా సంతోషించారు.
క్లాక్స్ దర్శకత్వంలో లౌక్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని ఈ చిత్రాన్ని నిర్మించారు. సి. యువరాజ్ సమర్పకులు. మణిశర్మ గారు సంగీతం అందించగా అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రామ్ ప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సత్య, సురభి ప్రభావతి, కిట్టయ్య, అనితానాథ్, దివ్య నార్ని ప్రధాన తారాగణం.
రొటీన్ కి భిన్నంగా ఉండే కథ కథనాలు ఆద్యంతం అలరించడంతో పాటు కడుపుబ్బా నవ్విస్తూనే ఆలోచింప చేస్తున్నాయి. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం తన కేరీర్ లోనే బెస్ట్. ముఖ్యంగా చిత్రంలోని చివరి 40 నిముషాలు థియేటర్లు నవ్వులతో నిండిపోతున్నాయి.
[ad_2]