Published on Apr 17, 2024 2:00 AM IST
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఇటీవల హర్రర్ థ్రిల్లర్ మూవీ భ్రమయుగం మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి సక్సెస్ సొంతం చేసుకున్నారు. అలానే మరోవైపు తాజాగా ది గోట్ లైఫ్ మూవీ ద్వారా సక్సెస్ సొంతం చేసుకున్నారు పృథ్వీరాజ్ సుకుమారన్.
అయితే విషయం ఏమిటంటే, లేటెస్ట్ మోలీవుడ్ వర్గాల బజ్ ప్రకారం త్వరలో తెరకెక్కనున్న ఒక థ్రిల్లర్ మూవీలో మమ్ముట్టి హీరోగా నటించనుండగా పృథ్వీరాజ్ అందులో విలన్ గా నటించనున్నారట. ఆంటో జోసెఫ్ నిర్మించనున్న ఈమూవీ యొక్క డీటెయిల్స్ త్వరలో వెల్లడి కానున్నాయి. కాగా 2010 లో వీరిద్దరూ కలిసి పొక్కిరి రాజా మూవీలో నటించారు. మొత్తంగా దీనిని బట్టి మళ్ళీ 14 ఏళ్ళ తరువాత వీరిద్దరూ కలసి నటించనున్నట్టు తెలుస్తోంది.