[ad_1]
మన టాలీవుడ్ సినిమా దగ్గర ఉన్న ఇప్పటి యంగ్ హీరోస్ లో ఏ పాత్రకి చూసుకున్నా కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే హీరో ఎవరు అనే ప్రశ్న వస్తే దానికి సమాధానంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పేరు ఖచ్చితంగా వస్తుంది. ఏ తరహా జానర్ లో అయినా కూడా ఇమిడి పోవడం ప్రభాస్ స్పెషాలిటీ అని చెప్పవచ్చు.
అది పీరియాడిక్ అయినా లవ్ అయినా యాక్షన్ అయినా కూడా ప్రభాస్ పర్ఫెక్ట్ అనిపిస్తాడు. మరి ఇలాంటి కటౌట్ ని సరిగ్గా వాడుకుంటే ఎలా ఉంటుందో ఇప్పుడు ప్రశాంత్ నీల్ చూపించడంతో ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఎగ్జైట్ అవుతున్నారు. అయితే ప్రభాస్ పై యంగ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ చేసిన కామెంట్స్ ప్రభాస్ ఫ్యాన్స్ కి మరింత కిక్ ఇచ్చేలా ఉన్నాయని చెప్పాలి.
ఇప్పుడు ప్రశాంత్ చేసిన భారీ ప్రాజెక్ట్ “హను మాన్” లాంటి సబ్జెక్టులో ప్రభాస్ లాంటి హీరో కనిపించి ఉంటే అది కూడా ఇంకో లెవెల్లో ఉంటుంది అనే దానికి అసలు ప్రభాస్ గారికి అసలు ఇలాంటి సూపర్ హీరోస్ సినిమాలు కానీ ఎలాంటి సూపర్ పవర్స్ కూడా అక్కరలేదని తాను తన పర్శనాలిటీ అలా ఉంటారని తెలిపాడు. నిన్న వచ్చిన ట్రైలర్ లో చూస్తేనే అర్ధం అవుతుందని చెప్పాడు. దీనితో ఈ కామెంట్స్ విన్న ప్రభాస్ ఫ్యాన్స్ హను మాన్ కి మరింత సపోర్ట్ అందిస్తున్నారు.
[ad_2]