[ad_1]
నితిన్ ప్రధాన పాత్రలో నటించిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీ డిసెంబర్ 8, 2023 న థియేటర్ల లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ చిత్రం రిలీజ్ కి దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ ను వేగవంతం చేయడం జరిగింది. ఇప్పటికే సినిమా నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ఆడియెన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే డీజే టిల్లు చిత్రంతో యూత్ లో సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న సిద్దు జొన్నలగడ్డ తో స్పెషల్ ఇంటర్వ్యూ ను ప్లాన్ చేశారు మేకర్స్.
సిద్దు జొన్నలగడ్డ హీరో నితిన్ ను ఇంటర్వ్యూ చేయనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన షూటింగ్ పూర్తి కాగా, త్వరలో ఈ ఇంటర్వ్యూ ను రిలీజ్ చేయనున్నారు. వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం లో యంగ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
[ad_2]