[ad_1]
Published on Apr 16, 2024 10:32 PM IST
యువ నటుడు అక్కినేని నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తాజా సినిమా తండేల్. ఈ మూవీని యువ దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ తో అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈమూవీకి సంబంధించి ప్రస్తుతం షూటింగ్ వేగంగా జరుగుతోంది.
ఇక తమిళ నటుడు ఆడుకాలం నరేన్, చరణ్‌దీప్ మరియు మహేష్ ఆచంట ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారట. ఈ తాజా షెడ్యూల్ బీహెచ్‌ఈఎల్‌లో ఏర్పాటు చేసిన జైలులో చిత్రీకరణ జరిగింది. తదుపరి షెడ్యూల్ మే 2 న ప్రారంభమై మే 18 వరకు కొనసాగుతుందట. కాగా ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి అక్టోబర్ లో ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.
[ad_2]