[ad_1]
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా సంయుక్తా మీనన్, మాళవిక నాయర్ హీరోయిన్స్ గా అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ డెవిల్.
ఇటీవల ఫస్ట్ లుక్ టీజర్, ఒక సాంగ్ తో అందరినీ ఆకట్టుకుని మంచి అంచనాలు ఏర్పరిచిన ఈమూవీ నుండి దిస్ ఈజ్ లేడీ రోజ్ అనే పల్లవితో సాగే సెకండ్ సాంగ్ ప్రోమోని నవంబర్ 24న రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ కొద్దిసేపటి క్రితం ప్రకటించారు.
కళ్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ గా నటిస్తున్న ఈ మూవీపై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్న డెవిల్ మూవీకి శ్రీకాంత్ విస్సా కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. కాగా త్వరలో ఈ మూవీ పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది.
[ad_2]