Home Cinema News ట్రైలర్ రిలీజ్ కి రెడీ అవుతోన్న విజయ్ దేవరకొండ ‘ఖుషి’ ? |

ట్రైలర్ రిలీజ్ కి రెడీ అవుతోన్న విజయ్ దేవరకొండ ‘ఖుషి’ ? |

0
ట్రైలర్ రిలీజ్ కి రెడీ అవుతోన్న విజయ్ దేవరకొండ ‘ఖుషి’ ? |

[ad_1]

యువ నటుడు విజయ్ దేవరకొండ, సమంత రూత్ ప్రభుల కలయిక లో యువ దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న తాజా సినిమా ఖుషి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు పాన్ ఇండియన్ రేంజ్ లో నిర్మిస్తున్న ఖుషి లవ్, యక్షన్, ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. ఇటీవల షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ మూవీకి హేషం అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తుండగా కీలక పాత్రల్లో సచిన్ ఖేడేకర్, వెన్నెల కిషోర్, జయరాం, మురళి శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు నటిస్తున్నారు.

ఇప్పటికే ఖుషి నుండి విడుదలైన మూడు సాంగ్స్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. విషయం ఏమిటంటే, ఈ మూవీ యొక్క థియేట్రికల్ ట్రైలర్ ఆగష్టు 9న విడుదల కానుందని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఇక నేడు కొద్దిసేపటి క్రితం 8 రోజులు, 14 రోజులు, 30 రోజులు అంటూ విజయ్ దేవరకొండ ఒక ట్వీట్ చేయడంతో, అందులో 8 రోజులు అనేది మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ అని, అక్కడి నుండి మూవీ యొక్క ప్రమోషన్స్ ఒక్కొక్కటిగా ప్రారంభం కానున్నాయని అంటున్నారు. అయితే దీని పై మేకర్స్ నుండి పక్కాగా క్లారిటీ అయితే రావాల్సి ఉంది. కాగా ఈ మూవీ సెప్టెంబర్ 1న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది.



[ad_2]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here