[ad_1]
Published on Apr 17, 2024 12:02 AM IST
టాలీవుడ్ యంగ్ హీరోస్ లో ఒకరైన విజయ్ దేవరకొండ తాజాగా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ స్టార్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి యావరేజ్ విజయం అందుకున్నారు. ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించారు. ఇక ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరితో ఒక స్పై యాక్షన్ మూవీ చేస్తున్నారు విజయ్. ఈ మూవీలో మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది.
ఈ మూవీకి అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ విషయమై హీరో విజయ్ పక్కాగా కేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా స్క్రిప్ట్ పరంగా దర్శకుడు గౌతమ్ తో పలుమార్లు క్షుణ్ణంగా చర్చించిన అనంతరం చిత్రీకరణలో పాల్గొంటున్నారట. నిర్మాత నాగవంశీ కూడా ఈ మూవీని ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారని తెలుస్తోంది. మొత్తంగా ఈసారి ఈ మూవీతో టార్గెట్ ఏ మాత్రం మిస్ కాదని, ఈ మూవీతో ఫ్యాన్స్ ని ఖుషి చేయాలని విజయ్ ఎంతో కష్టపడుతున్నట్లు తెలుస్తోంది.
[ad_2]