[ad_1]
Published on Jan 18, 2024 10:01 AM IST
నాచురల్ స్టార్ నాని హీరోగా టాలెంటెడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా డెబ్యూ దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కించిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం “హాయ్ నాన్న” కోసం తెలిసిందే. మరి నాని కెరీర్ లో 30వ సినిమాగా తెరకెక్కించగా నాని కెరీర్ లో మరో సూపర్ హిట్ గా ఈ చిత్రం నిలిచింది. ఇక ఈ చిత్రం రీసెంట్ గానే ఓటిటి లో స్ట్రీమింగ్ కి వచ్చిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా భాషల్లో ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో ఇప్పుడు అందుబాటులో ఉంది.
అయితే ఈ చిత్రం ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో గ్లోబల్ వైడ్ గా అదరగొడుతుంది. ఈ జనవరి 8 నుంచి 14 వరకు నెట్ ఫ్లిక్స్ గ్లోబల్ ఛార్ట్స్ లో హాయ్ నాన్న హిందీ వెర్షన్ టాప్ 4 లో ట్రెండింగ్ లో 12 లక్షల వ్యూస్ తో నిలిచింది. అలాగే టాప్ 6 లో ఇదే గ్లోబల్ ఛార్ట్స్ లో జనవరి 8 నుంచి 14 న 1 మిలియన్ వ్యూస్ తో తెలుగు వెర్షన్ 6వ స్థానంలో నిలిచింది. దీనితో హాయ్ నాన్న చిత్రం గ్లోబల్ గా అదరగొడుతుంది అని చెప్పాలి.
[ad_2]