[ad_1]
క్రేజీ డైరెక్టర్ శంకర్ – మెగాపవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్’ కాంబినేషన్ లో రాబోతున్న పాన్ ఇండియా సినిమా గేమ్ ఛేంజర్. ఐతే, ఈ సినిమాలోని ఓ పాట బేసిక్ వెర్షన్ కొన్ని రోజుల క్రితం ఆన్‌లైన్‌లో లీక్ అయ్యింది. పైగా అది బాగా వైరల్ కూడా అయ్యింది. నిజానికి దసరా సందర్భంగా ఈ పాటను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ పాటకు సంబంధించి చిత్ర బృందం నేడు అప్ డేట్ ను ఇవ్వనుందని ఫిల్మ్ సర్కిల్స్‌లో తాజా సమాచారం.
ఇప్పడున్న అప్ డేట్ ప్రకారం అక్టోబర్ 28న ఈ పాట విడుదలకు ప్లాన్ చేస్తున్నారట. ఐతే, ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఈ సినిమాలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ భారీ సినిమాలో చరణ్ పాత్ర వెరీ పవర్ ఫుల్ గా ఉండనుంది. నిజానికి సహజంగానే తన సినిమాల్లో హీరోల్ని డిఫరెంట్ గెటప్స్ అండ్ మేకప్స్ తో చూపించే ఆనవాయితీ ఉన్న శంకర్, ఈ సినిమాలో చరణ్ ను కూడా వినూత్నంగా చూపించబోతున్నాడు.
ఈ పొలిటికల్ డ్రామాలో శంకర్ ప్రెజెంటేషన్ కోసం అయితే ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు తమ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో తన 50వ సినిమాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
[ad_2]