[ad_1]
యువ నటీనటులు రిష్వి తిమ్మరాజు, విస్మయశ్రీ హీరో హీరోయిన్లుగా రూపొందిన తాజా చిత్రం ‘కృష్ణ గాడు అంటే ఒక రేంజ్’. శ్రీ తేజస్ ప్రొడక్షన్ ప్రై లిమిటెడ్ బ్యానర్ పై పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ, పిఎన్‌కే శ్రీలత, పెట్లా రఘు రామమూర్తి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. రాజేష్ దొండపాటి తెరకెక్కించిన ఈ చిత్రం ఆగస్ట్ 4న రిలీజ్ అయింది. థియేటర్లో మంచి రెస్పాన్స్ దక్కించుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుంటోంది.
మంచి లవ్ స్టోరీ, స్వచ్చమైన ఎమోషన్స్‌తో తీసిన ఈ విలేజ్ డ్రామా థియేటర్లో ఆడియెన్స్ నుంచి, విమర్శకుల నుంచి మంచి ప్రశంసలను అందుకుంది. ఇప్పుడు ఆహాలో ఈ చిత్రం స్ట్రీమ్ అవుతోంది. ఓటీటీ ఆడియెన్స్‌ను సైతం ఈ మూవీ ఆకట్టుకుంటోంది. స్వచ్చమైన ప్రేమ కథకు ట్విస్టులు, ఎమోషన్‌ను జోడించడంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఇది అలరిస్తోంది. ఇక హీరో హీరోయిన్ల నటన, వారిద్దరి కెమిస్ట్రీ ఈ చిత్రానికి ప్రధాన బలం.
ఈ చిత్రానికి సాబు వర్గీస్ సంగీతం, ఎస్‌కే రఫీ అందించిన కెమెరావర్క్ అదనపు ఆకర్షణగా నిలిచాయి. గ్రామీణ ప్రాంతంలోకి ఆడియన్స్ ని తీసుకెళ్లేలా కెమెరామెన్ అద్భుతం చేశారు. కొత్త టీం అంతా కలిసి చేసిన ఈ ప్రయత్నం థియేటర్లో అందరినీ మెప్పించగా ఇప్పుడు ఆహాలో లో కూడా అందరినీ ఆకట్టుకుంటుండడంతో మేకర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
[ad_2]