[ad_1]
టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు పలు చిత్రాలు చేస్తుండగా రీసెంట్ గానే తన “బ్రో” చిత్రం విషయంలో వచ్చిన కాంట్రవర్సీపై తన మాజీ భార్య రేణు దేశాయ్ స్పందించారు. అయితే ఈ అంశం తర్వాత తాజాగా తన కొడుకు అకీరానందన్ ప్రస్తుతం ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో ఓనమాలు నేర్చుకుంటున్నాడు అని విషయం తెలియగా ఇక నెక్స్ట్ పవర్ స్టార్ తర్వాత అకీరా కూడా సినిమా ఎంట్రీ ఇస్తాడు అని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారాయి.
అయితే అసలు అకీరానందన్ సినిమా ఎంట్రీ విషయంలో తన తల్లి రేణు దేశాయ్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు అకిరా అయితే నటన పట్ల అంత ఆసక్తి ఏమీ లేడు ఒకవేళ తనకి నటన పట్ల ఆసక్తి ఉండి సినిమాలు చేస్తాను అని చెప్తే మొట్ట మొదటగా నేనే మీ అందరితో ఆ విషయాన్ని పంచుకుంటాను ప్రస్తుతానికి ఈ కామెంట్స్ అన్నీ వద్దు అన్నట్టుగా తెలిపారు. దీనితో తన లేటెస్ట్ ఇన్స్టా పోస్ట్ వైరల్ గా మారింది.
[ad_2]