[ad_1]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మీరా జాస్మిన్ హీరోయిన్ గా వీరశంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ గుడుంబా శంకర్. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నాగబాబు నిర్మించిన ఈ సినిమా 2004లో విడుదలై మంచి విజయం అందుకుంది. ఇక ఈ సినిమాని ఈ ఏడాది ఆగష్టు 31న రీరిలీజ్ చేయనున్నట్లు ఇటీవల ప్రకటించిన నిర్మాత నాగబాబు, మూవీని రెండు రోజుల అనంతరం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కానుకగా సెప్టెంబర్ 2న విడుదల చేస్తున్నట్లు లేటెస్ట్ గా తన సోషల్ మీడియా ప్రొఫైల్స్ ద్వారా తెలిపారు.
మరోవైపు తాజాగా రిలీజ్ అయిన గుడుంబా శంకర్ రీరిలీజ్ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ గా అప్పటి ఆడియన్స్ ని ఆకట్టుకున్న గుడుంబా శంకర్ సాంగ్స్ కూడా మంచి ఆదరణ అందుకున్నాయి. మరి గుడుంబా శంకర్ మూవీ ఇప్పటి ఆడియన్స్ ని ఎంతవరకు అలరిస్తుందో చూడాలి. ఆశిష్ విద్యార్థి, బ్రహ్మానందం, రాజన్ పి దేవ్, షాయాజీ షిండే, ఆలీ, జ్యోతి, సునీల్ తదితరులు ఇందులో కీలక పాత్రలు చేసారు.
https://t.co/ZXYb9JfORm
We are planning to celebrate the birthday of both my leader and my brother, Pawan Kalyan, by re-releasing the movie “Gudumbashankar” on this special day. The celebration will be filled with joy and Magnum Opus entertainment. We have chosen September 2nd…— Naga Babu Konidela (@NagaBabuOffl) August 19, 2023
[ad_2]