[ad_1]
Published on Apr 17, 2024 7:06 AM IST
నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా చేసిన సెన్సేషనల్ హిట్ చిత్రాల్లో తన హ్యాట్రిక్ హిట్ చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో చేసిన భారీ హిట్ చిత్రం “అఖండ” కూడా ఒకటి. మరి తెలుగు సినిమా దగ్గర భారీ విజయాన్ని నమోదు చేసిన ఈ సినిమాకి సీక్వెల్ ని కూడా మేకర్స్ ఖరారు చేసారు. మరి దీనిపై బోయపాటి కూడా క్లారిటీ ఇవ్వగా ఫ్యాన్స్ లో మరింత ఆసక్తి నెలకొంది.
అయితే దీనితో పాటుగా ఇప్పుడు మరో ఆసక్తికరమైన సాలిడ్ అప్డేట్ బయటకి వచ్చింది. దీనితో పార్ట్ 2 లో మాత్రం బాలయ్య లుక్ మరోలా మొదటి భాగానికి మించి ప్లాన్ చేస్తున్నారట. డెఫినెట్ గా కొత్తగా ఎక్స్ట్రార్డినరి గా అఖండ 2 లుక్ ఉంటుందట. ఆల్రెడీ ఈ లుక్ డిజైన్ పనుల్లోనే బోయపాటి అండ్ టీం ఇప్పుడు బిజీగా ఉన్నారట. దీనితో పార్ట్ 1కి మించి ట్రీట్ సరికొత్తగా పార్ట్ 2 లో ఉంటుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్ లు ముందు రోజుల్లో రానున్నాయి.
[ad_2]