[ad_1]
Published on Apr 17, 2024 3:00 AM IST
సౌత్ ఇండస్ట్రీ నుండి వస్తున్న చిత్రాలు దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంటున్నాయి. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పాన్ ఇండియా చిత్రాలు కల్కి (Kalki2898AD), పుష్ప 2 (Pushpa 2 the rule), గేమ్ చేంజర్ (Game changer), దేవర (Devara). రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) లు ఈ చిత్రాల్లో టైటిల్ రోల్స్ ప్లే చేస్తున్నారు.
ఈ చిత్రాలకి సౌత్ లో మాత్రమే కాకుండా, నార్త్ లో కూడా భారీ ఓపెనింగ్స్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఈ నాలుగు భారీ చిత్రాలను ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ అయిన అనిల్ తడాని నార్త్ ఇండియా లో డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు. గతంలో బాహుబలి పార్ట్ 1, బాహుబలి పార్ట్ 2, కేజీఎఫ్ చాప్టర్ 1, కేజీఎఫ్ చాప్టర్ 2, కాంతార, పుష్ప, సలార్ చిత్రాలతో పాటుగా, రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ హాను మాన్ మూవీ తో పాటుగా ఎన్నో చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈ చిత్రాల పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
[ad_2]