[ad_1]
Published on Feb 7, 2024 6:16 PM IST
యువ నటుడు విజయ్ దేవరకొండ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న లేటెస్ట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఫ్యామిలీ స్టార్. ఈ మూవీకి గోపిసుందర్ సంగీతం అందిస్తుండగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నారు.
ఇక ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ తో అందరిలో మంచి హైప్ ఏర్పరిచిన ఫ్యామిలీ స్టార్ నుండి నేడు నందనందనా అనే పల్లవితో సాగె మెలోడియస్ సాంగ్ ని రిలీజ్ చేసారు. అనంత శ్రీరామ్ ఆకట్టుకునే లిరిక్స్ అందించిన ఈ మెలోడియస్ సాంగ్ ని యువ గాయకుడు సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు.
ప్రస్తుతం ఈ లిరికల్ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటూ యూట్యూబ్ లో మంచి వ్యూస్ అందుకుంటోంది. కాగా అన్ని కార్యక్రమాలు ముగించి ఫ్యామిలీ స్టార్ మూవీని సమ్మర్ కానుకగా ఏప్రిల్ 5 న థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారు.
[ad_2]